Ram Charan: మెగా ఇంట కవలల సందడి.. బాబు, పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన
హైదరాబాద్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31, శుక్రవారం రాత్రి ఉపాసన కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తల్లి, చిన్నారులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే ఈ జంటకు ‘క్లింకార’ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు కూడా పుట్టడంతో మెగా వారసుడు వచ్చాడంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో ఒక వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. తన ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే మనవడు, మనవరాలు ఇద్దరూ రావడంతో మెగా కుటుంబం పరిపూర్ణమైంది.
2012లో వివాహం చేసుకున్న చరణ్-ఉపాసన దంపతులు, తమ జీవితంలోకి కొత్త అతిథులను ఆహ్వానించడం పట్ల సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






