Pooja Bedi: ఎన్టీఆర్ గొప్పదనాన్ని బయటపెట్టిన పూజా బేడీ
శక్తి(Sakthi) సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్(NTR) హీరోగా మెహర్ రమేష్(mehar ramesh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఫ్లాపుగా నిలవడానికి కారణాలెన్నో ఉన్నాయి. సోషియో ఫాంటసీ మూవీగా చేద్దామని నిర్మాత అశ్వినీదత్(Aswini dutt) ఇచ్చిన సలహా వల్లే కథంతా మారిపోయిందని డైరెక్టర్ మెహర్ రమేష్ చెప్పిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మూవీ పూజా బేడీ(pooja bedi) ఈ సినిమాలో ఫక్తూని అనే విలన్ పాత్రలో నటించింది. ఆ సినిమా ఫ్లాపవడంతో పూజా బేడీకి తెలుగులో తర్వాత ఛాన్సులు రాలేదు. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా(barabar premista) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న పూజా, రీసెంట్ గా ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ పూజా శక్తి షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుంది.
శక్తి మూవీలో తాను విలన్ గా నటించానని, సినిమాలో ఓ సీన్ కోసం ఎన్టీఆర్ తనతో ఫైట్ చేయాల్సి ఉంటుందని, కానీ ఎన్టీఆర్ దానికి నిరాకరించినట్టు ఆమె చెప్పింది. మహిళలతో ఫైట్ చేయడానికి తాను ఏ మాత్రం ఒప్పుకోనని ఎన్టీఆర్ చాలా కచ్ఛితంగా చెప్పాడని, ఎన్టీఆర్ వ్యక్తిత్వం చూసి ఫిదా అయిపోయానని చెప్పింది. ఇప్పటికే ఎన్టీఆర్ మంచి తనాన్ని ఎంతోమంది బయటపెట్టగా ఇప్పుడు పూజా బేడీ కూడా ఎన్టీఆర్ గొప్పదనాన్ని ప్రశంసించింది.






