పండగ కళ మొత్తం పాయల్ లోనే!
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా పాయల్ దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేయగా, ఈ ఫోటోల్లో అమ్మడు పర్పుల్, ఐవరీ షేడ్స్ లో ఉన్న మోడ్రన్ లెహంగా లో మెరిసింది. దానికి మ్యాచింగ్ గా కార్సెట్ బ్లౌజ్ పై సీక్విన్స్ వర్క్ అమ్మడి అందాన్ని మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. అవుట్‌ఫిట్ కు తగ్గట్టు జ్యుయలరీ ధరించి పండగ కళ మొత్తాన్ని తనలో నింపుకుందని నెటిజన్లు పాయల్ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.







