శనివారం బాక్సాఫీస్ వద్ద రామాయణ, సూర్య సీన్ జోరు!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన రామాయణ(Ramayana) సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లభించలేదు. అయితే ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు క్రమంగా బలాన్ని పెంచింది. శుక్రవారం నుంచి కలెక్షన్లు పుంజుకోగా, శనివారం నాటికి థియేటర్లన్నీ ఆడియన్స్ తో కళకళలాడాయి. ముఖ్యంగా 3డీ వెర్షన్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. హిందీ వెర్షన్‌కు మల్టీప్లెక్స్‌లతో పాటు ప్రధాన నగరాల్లో విశేష స్పందన లభిస్తోంది.
మరోవైపు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రామాయణ కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. నార్త్ ఇండియాలో కూడా సినిమా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కొనసాగిస్తోంది. నార్త్ అమెరికాతో పాటు ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా అన్ని ప్రధాన మార్కెట్లలోనూ మంచి కలెక్షన్లను రాబడుతూ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక ఈ హాలిడే సీజన్లో మరో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచిన సూర్య(Suriya) నటించిన సీన్(Scene) సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మౌత్ టాక్ కలిసిరావడంతో శనివారం థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లోనూ హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. లిమిటెడ్ బడ్జెట్లో తక్కువ టైమ్ లో పూర్తైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి శనివారం రామాయణ, సీన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.







