యాక్టింగ్ కు గుడ్‌బై చెప్పనున్న రణ్‌బీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) తన సినీ కెరీర్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నటుడిగా మరో పదేళ్లు మాత్రమే కొనసాగాలని భావిస్తున్నానని, ఆ తర్వాత డైరెక్షన్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. ఇప్పటికే డైరెక్టర్ గా తన మొదటి సినిమా కోసం కథ రెడీ చేసే వర్క్ ను ప్రారంభించినట్లు తెలిపారు. గత రెండు మూడు నెలలుగా స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నానని, రాబోయే రెండేళ్లలో లేదా మూడేళ్లలో మెగాఫోన్ పట్టుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. యాక్టింగ్ తో పోలిస్తే ఒక కథను తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ బాధ్యత తనకు మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పారు.
అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే డైరెక్షన్ పై దృష్టి పెట్టనున్నారు. బ్రహ్మాస్త్ర2(Brahmastra2), యానిమల్2(Animal2), రామాయణం పార్ట్ 2(Ramayanam part2) వంటి భారీ ప్రాజెక్టులు రణ్‌బీర్ లైనప్‌లో ఉన్నాయి. ఏడాదిలో సుమారు 100 నుంచి 125 రోజుల వరకు మాత్రమే షూటింగ్స్‌లో పాల్గొంటానని, మిగిలిన టైమ్ ను కొత్త కథలు, ఆలోచనల కోసం కేటాయిస్తున్నానని వెల్లడించారు.
తన తొలి దర్శకత్వ చిత్రాన్ని భారీ యాక్షన్ సినిమాగా కాకుండా ఓ అందమైన ఫ్యామిలీ స్టోరీగా రూపొందించాలని రణ్‌బీర్ భావిస్తున్నారు. లైఫ్ లోని చిన్న చిన్న అనుభూతులు, ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చే ఫీల్‌గుడ్ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life is beautiful), ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్(Its a wonderful life) వంటి సినిమాలతో పాటు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ(Rajkumar hirani) సినిమాలు తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. దీంతో రణ్‌బీర్ డైరెక్టర్ గా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది.







