మొదటి సినిమాతోనే సాహసం.. మూగ పాత్రలో అనీష్!
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అనీష్(Aniesh) తన మొదటి సినిమాతోనే విభిన్నమైన పాత్రను ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెంకీ కుడుముల(Venky kudumula) కథ అందించిన ఇట్లు అర్జున(Itlu arjuna)లో ఆయన మూగ యువకుడిగా కనిపించనున్నారు. మాటలు లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో భావాలను పలికించాల్సిన క్యారెక్టర్ కావడంతో నటుడిగా ఇది తనకు గొప్ప పాఠమని అనీష్ చెబుతున్నారు. మహేష్ ఉప్పాల(Mahesh uppala) ద్వారా ఈ కథ తన వద్దకు వచ్చిందని, గతంలో ఆయన రూపొందించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ(OKa chinna family story) వెబ్ సిరీస్‌లోని డ్రామా తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. కథ విన్నప్పుడే క్యారెక్టర్ లోని స్పెషాలిటీ ఇంట్రెస్ట్ ను పెంచిందని, నటుడిగా తన కెరీర్ ను మంచి కథతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఒప్పుకున్నట్టు తెలిపారు.
మొదటి సినిమానే ఇలాంటి ఛాలెంజ్‌తో కూడుకున్న క్యారెక్టర్ కావడంతో తాను మొదట్లో కొంత ఆందోళనకు గురయ్యారట. ముఖ్యంగా అనస్వర రాజన్(Anaswara rajan) వంటి టాలెంటెడ్ నటితో కలిసి పనిచేయడం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఆమె యాక్టింగ్, ఎనర్జీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. డైలాగ్స్ లేని క్యారెక్టర్ లో ఎమోషన్స్ ను పలికించడం, సహజమైన శబ్దాలను ఉపయోగించడం, డబ్బింగ్ టైమ్ లో సరైన ఎక్స్ప్రెషన్స్ పలికించడం అనుకున్నంత ఈజీ కాలేదని వివరించారు. డైరెక్టర్ స్టోరీలో ఎమోషన్స్, డ్రామాను మేళవించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
ఈ సినిమాకు నాగార్జున(Nagarjuna) వాయిస్ ఓవర్ అందించడంతో పాటు ప్రెజెంటర్‌గా వ్యవహరించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తెలిసిన నాగార్జునను ఈ ఆలోచనతో సంప్రదించగా ఆయన సంతోషంగా అంగీకరించారని అనీష్ వెల్లడించారు. సినిమా చూసిన తర్వాత స్వయంగా ప్రెజెంట్ చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. అఖిల్(Akhil)తో తనకు మంచి బాండింగ్ ఉందని, ఆయన నుంచి తరచూ సలహాలు తీసుకుంటానని తెలిపారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న తేజ సజ్జా(Teja Sajja) కెరీర్ కూడా తనకు స్ఫూర్తినిస్తోందని అనీష్ పేర్కొన్నారు.







