బాలయ్యతో నర్గీస్ మాస్ ధమాకా!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా(Dada)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టైటిల్, బర్త్‌డే గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో బాలయ్య(balayya) సరికొత్త యంగ్ లుక్‌లో కనిపించడంతో పాటు, పవర్ఫుల్ యాక్షన్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
తాజాగా దీపావళి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్(SS Thaman) స్వరపరిచిన దాదా ధమాకా సాంగ్ లో బాలకృష్ణ తనదైన మాస్ డ్యాన్స్‌తో సందడి చేయనున్నారు. ఈ సాంగ్ లో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ(Nargis Fakri) కూడా బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. నవంబర్ 13న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్లో కనిపిస్తున్న గ్రాండ్ విజువల్స్ సాంగ్ పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
బాలకృష్ణ ఎనర్జీ, నర్గీస్ ఫక్రీ గ్లామర్, తమన్ మాస్ బీట్స్ కలిస్తే థియేటర్లలో ఫ్యాన్స్ కు పండగేనని చెప్పొచ్చు. ఈ సినిమాతో మరో భారీ సక్సెస్‌ను అందుకోవాలని డైరెక్టర్ గోపీచంద్ మలినేని టార్గెట్ గా పెట్టుకున్నారు. వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్(Manchu manoj), కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కీలక పాత్రలు పోషిస్తున్నారు.







