సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పుట్టినరోజు సందర్భంగా దేశ, రాష్ట్ర స్థాయి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుకున్నారు. రాబోయే సంవత్సరం అద్భుతంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, సుదీర్ఘమైన, పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓం బిర్లా పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మరిన్ని సంవత్సరాల పాటు ప్రజాసేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ విజయవంతమైన భవిష్యత్తును కొనసాగించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.







