విజువల్ ఎఫెక్ట్స్‌తో రామాయణకు భారీ రెస్పాన్స్!
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన భారీ సినిమా రామాయణ(Ramayana) ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో తొలి భాగం థియేటర్లలో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓ మోస్తరు కలెక్షన్లతో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రం షోల నుంచి ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. వీకెండ్ లో ఈ సినిమా మరింత మెరుగైన కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్. ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ (DNEG), నిర్మాత నమిత్ మల్హోత్రా(Namith malhotra)కు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ విభాగంపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. భారీ బడ్జెట్ తో రూపొందించిన విజువల్స్ ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ముఖ్యంగా జటాయువు పోరాట ఘట్టం, ఆరంభ సన్నివేశాలు, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యాక్టింగ్ పరంగా రావణుడిగా యశ్(Yash) తనదైన ప్రభావాన్ని చూపించగా, రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor), సాయి పల్లవి(Sai pallavi) యాక్టింగ్ కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
అయితే ఏఆర్ రెహమాన్(AR Rahman) అందించిన సాంగ్స్ మాత్రం ఆడియన్స్ అందరినీ మెప్పించలేకపోయాయి. మ్యూజిక్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువగా ఉండటం కొంత ప్రతికూల అంశంగా మారింది. ఈ రెండు విషయాలను మినహాయిస్తే టెక్నికాలిటీ, నటీనటుల ప్రదర్శన, విజువల్స్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. నితేష్ తివారీ(Nitesh tiwari) దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.







