ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు







