బొండపల్లిలో మాజీ మంత్రి బొత్స కుమార్తె ఓటమి
విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ (Bondapalli ZPTC) స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కుమార్తె అనూష (Anusha) ఓటమి పాలయ్యారు. బొత్స అనూషపై టీడీపీ అభ్యర్థి పాశాల నీరజ (Pasala Neeraj) 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నీరజ విజయవంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రేసులో ఉన్న అనూష ఓటమిపాలవడంతో వైసీపీ (YSRCP) శ్రేణులు డీలాపడ్డాయి.







