విజయ్ సేతుపతి సినిమాల రిలీజ్‌పై కన్ఫ్యూజన్!
కోలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి(Vijay sethupathi) ఒకరు. హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా, కీలక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన బత్తా(Battha) ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మొదట దీపావళికి రావాల్సిన ట్రైన్ డిసెంబర్ 4కు వాయిదా పడింది. మరోవైపు పాకెట్ నోవెల్(Pocket novel) సంక్రాంతి 2027 బరిలో నిలిచేందుకు రెడీ అవుతోంది.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) తెరకెక్కించిన ఇంజి వెల్లం(Inji vellam) కూడా విజయ్ సేతుపతి పూర్తిచేసిన సినిమాల్లో ఒకటి. ఇందులో సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను సంక్రాంతికి కిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పాకెట్ నోవెల్ కూడా అదే సీజన్‌ను టార్గెట్ గా చేసుకోవడంతో రిలీజ్ డేట్స్ విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు పూరి జగన్నాథ్(Puri jagannadh) దర్శకత్వంలో రూపొందిన స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 Temple road) షూటింగ్ కూడా పూర్తైంది. ఈ సినిమాను 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇలా విజయ్ సేతుపతి నటించిన నాలుగు సినిమాలు రాబోయే రెండు నెలల్లో లేదా సంక్రాంతి సీజన్లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ నిర్మాతలు, దర్శకుల డెసిషన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. ఒక సినిమా వాయిదా పడితే మరో సినిమా రిలీజ్ ప్లానింగ్ మారే పరిస్థితి నెలకొంది. వరుసగా సినిమాలను పూర్తి చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతికి ఇప్పుడు వాటి రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకే టైమ్ లో ఇన్ని సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాల మధ్యే పోటీ నెలకొంటుందా అన్నది చూడాలి.







