జపాన్‌లో సూర్య 48 స్పెషల్ షెడ్యూల్!
తమిళ స్టార్ సూర్య(Suriya), డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా సూర్య48 (Suriya48) రిలీజ్‌కు మేకర్స్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జై భీమ్(Jai Bhim) వంటి ప్రశంసలు అందుకున్న సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిల్మ్స్(Hombale Films) నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 మే 1న థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, రాబోయే కొన్ని నెలల్లో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ దీపావళి తర్వాత జపాన్ వెళ్లనుందని సమాచారం. విదేశాల్లో జరిగే ఈ షెడ్యూల్ షూటింగ్ లో కీలకంగా మారనుంది. ఈ సినిమాలో కయాదు లోహర్(Kayadhu lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్(Prakash Raj), యోగిబాబు(Yogi babu), ఎలంగో కుమారవేల్(Elango kumaravel) ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు, తన సినిమా షూటింగులు, ఇతర వృత్తిపరమైన బాధ్యతలను పూర్తి చేసుకున్న తర్వాత సూర్య కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నారట. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి లోపే సూర్య 48 షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ తర్వాత సూర్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు. 2027 సమ్మర్ రిలీజే టార్గెట్ గా ఈ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి.







