అభ్యంతరకర ఫోటోలపై సురేఖా వాణి న్యాయపోరాటం!
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలు వైరల్ అవుతుండటంపై నటి సురేఖా వాణి(Surekha Vani) తీవ్రంగా స్పందించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్న కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల వెనుక ఉన్న వాస్తవాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవి నిజమైన ఫొటోలేనా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసినవా అనే డిస్కషన్ జరుగుతోంది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సురేఖా వాణి డిసైడ్ అయినట్టు సమాచారం.
గతంలోనూ సురేఖా వాణి ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. 2026 అక్టోబర్లో తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలున్నాయంటూ ఓ సోషల్ మీడియా అకౌంట్ లో అభ్యంతరకరమైన పోస్టు ప్రచారంలోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, సదరు పోస్టు చేసిన అకౌంట్ వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
తాజాగా మరోసారి ఆమె ఫొటోలను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ ను కించపరిచేలా డిజిటల్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తప్పుడు సినిమాలను సృష్టించి, ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు సురేఖా వాణి న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.







