NTR: ఫ్యాన్స్ కు కుకీస్ పంపిన ఎన్టీఆర్
సోషల్ మీడియా ప్రారంభ దశల్లో సినీ తారలు అభిమానులతో నేరుగా మమేకమవుతూ వారి కామెంట్లకు స్పందించడం సాధారణంగా కనిపించేది. అయితే కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ను స్పెషల్ టీమ్స్ తో మెయిన్ టెయిన్ చేయిస్తుండగా, ఫ్యాన్స్ తో డైరెక్ట్ సంభాషణలు జరపడం అరుదుగా మారింది. సోషల్ మీడియాలో పెరిగిన నెగెటివిటీ, విమర్శలు, ట్రోలింగ్ వంటి అంశాల కారణంగా కూడా ప్రముఖులు దూరంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోల నుంచి ఒక చిన్న రియాక్షన్ వచ్చినా అభిమానుల్లో అది పెద్ద చర్చకు దారితీస్తోంది.
అలాంటి సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) చేసిన చిన్న చర్య సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన ఇంట్లో కుకీలు తయారు చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానులు భారీగా స్పందించారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా కొందరు అభిమానులు చేసిన పోస్టులకు ఎన్టీఆర్ స్వయంగా స్పందించడం విశేషంగా నిలిచింది. ఒక అభిమాని కుకీలు కావాలని కోరగా, అతనికి కుకీలు పంపించి సర్ప్రైజ్ ఇచ్చినట్లు సమాచారం. మరో అభిమానికి సరదా ఎమోజీతో రిప్లై ఇవ్వడం కూడా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఈ స్పందనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఎన్టీఆర్ అభిమానులతో మళ్లీ నేరుగా మమేకమవడం ఆయన ఫ్యాన్‌బేస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోల చురుకుదనం అభిమానులతో మరింత బలమైన అనుబంధాన్ని పెంచుతుందనే చర్చ కూడా మొదలైంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prasanth Neel) తెరకెక్కిస్తున్న డ్రాగన్(Dragon) షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా 2027 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








