Vamshi Paidipally: సల్మాన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(vamsi paidipally) దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(salman khan) నటించనున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) హీరోయిన్గా నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ షారుఖ్ ఖాన్(Shah rukh khan) తో చేసిన జవాన్(Jawaan) మూవీతో బాలీవుడ్లో తన మార్క్ చూపించిన నయనతార, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఉండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నెలలో షూటింగ్ ను మొదలు పెట్టేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో సల్మాన్ ఖాన్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో పనిచేస్తుండటం గమనార్హం. ఇది సినిమా బిజినెస్ మోడల్ పరంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం మాతృభూమి(Mathrubhoomi) మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్, అది పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్‌పైకి వెళ్లనున్నారు. మరోవైపు నయనతార(nayanthara) యష్(Yash) నటిస్తున్న టాక్సిక్(Toxic) మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో బాలకృష్ణ(Balakrishna) తో మరో సినిమా చేస్తున్న నయన్, ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








