నచ్చిన కథ కోసమే మృణాల్ ఎదురుచూపులు.. ‘రాకా’పై క్లారిటీ ఏదీ?
టాలీవుడ్లో సీతారామం(Sitaramam) మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడం కంటే తన యాక్టింగ్ కు గుర్తింపు తెచ్చే క్యారెక్టర్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడానికి ఇదే కారణమని ఆమె వెల్లడించారు. తన దగ్గరకు కథలు వస్తున్నప్పటికీ, నటిగా తనను పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే కథ ఏదీ దొరకలేదని మృణాల్ పేర్కొన్నారు. షూటింగ్ కోసం ఒక సినిమాకు కేటాయించే టైమ్, శ్రమను దృష్టిలో ఉంచుకుని, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్(Allu arjun), అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాకా(raaka)లో మృణాల్ నటించబోతున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఊహాగానాలపై మృణాల్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తన నెక్ట్స్ మూవీస్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని ఆమె చెప్పడంతో రాకాలో ఆమె భాగస్వామ్యంపై ఆసక్తి కొనసాగుతోంది.
దీపికా పదుకొణె(Deepika Padukone) కూడా నటిస్తున్న రాకా(Raaka)పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee) తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. అయితే, మృణాల్ తాజా వ్యాఖ్యలను బట్టి ఆమె ఈ మూవీకి సైన్ చేసినట్లు నిర్ధారించలేం. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మృణాల్ భాగమవుతారా? లేక తనకు నచ్చిన మరో కథతో ఆడియన్స్ ముందుకు వస్తారా? అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








