నితిన్ సరసన మీనాక్షి చౌదరి? కొత్త కాంబినేషన్పై ఆసక్తి!
టాలీవుడ్ హీరో నితిన్(nithin) మరో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సామజవరగమన(Samajavaragamana)తో కామెడీ ఎంటర్టైనర్ను సక్సెస్ఫుల్ గా తెరకెక్కించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు(Raj Abbaraju)తో ఆయన ఓ సినిమా చేయనున్నారనే ప్రచారం ఫిల్మ్నగర్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి, విభిన్నమైన పాత్రలతో తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నితిన్తో ఆమె జతకడితే తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. అయితే హీరోయిన్గా మీనాక్షి ఎంపికపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఈ వార్తకు సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, సామజవరగమనతో ఎంటర్టైనింగ్ కథనాన్ని అందించిన రామ్ అబ్బరాజు.. నితిన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఇక నితిన్ ప్రస్తుతం అలియాస్ రుక్మిణి(Alias Rukmini) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను నాని(nani) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వంలోని సినిమాను పట్టాలెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ వివరాలపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








