Mirzapur The Film: షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ ది ఫిల్మ్
వెబ్‌సిరీస్‌ల్లో మీర్జాపూర్(mirzapur) సిరీస్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ వేరు. కరోనా టైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు మంచి డిమాండ్ ఉండేది. ఆ టైమ్ లో ఎక్కడ చూసినా, ఎవరు పట్టినా ఈ సిరీస్ గురించే మాట్లాడుకునేవారు. ఈ సిరీస్ నుంచి మూడు సిరీస్ లు రాగా, మూడు సీజన్లకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
మీర్జాపూర్ సాగాను ఓటీటీకే పరిమితం చేయడం ఇష్టం లేక మేకర్స్ దీన్ని సినిమాగా మలచాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మీర్జాపూర్ ది ఫిల్మ్(mirzapur the film) అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. మీర్జాపూర్ ది ఫిల్మ్ షూటింగ్ పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సినిమా గతేడాది ఆగస్టులోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లింది. కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ పూర్తి చేశారు. వెబ్‌సిరీస్ లోని కంటెంట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కంటెంట్ ఉంటుందని, త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్టు వెల్లడించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన గుర్మీత్ సింగ్(gurmeeth singh) ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.






