Meenakshi Chaudhary: ఫుడ్ తర్వాతే ఏదైనా అంటున్న మీనాక్షి
ఇండస్ట్రీలో అందరి మనసుల్నీ మెప్పించి, అందరినీ అలరించాలంటే నటీనటులు తమ నటనతోనే కాకుండా, తమ గ్లామర్ తో పాటూ ఫిట్నెస్ విషయంలో కూడా ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. అందుకే సెలబ్రిటీలందరూ తమ బరువు, గ్లామర్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటుంటారు. అంతేకాదు, ఆహార నిమయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తినడమెందుకు? బరువు పెరగడమెందుకని తమ నోటికి తాళం వేసుకుంటూ ఉంటారు. కానీ సక్సెస్ఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మాత్రం ఫుడ్ విషయంలో చెప్తున్న మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్ గా మీనాక్షి ఓ పార్టీకి వెళ్లి అక్కడ భోజనం చేస్తూ మాట్లాడిన మాటలు ఓ వీడియో రూపంలో బయటకు రాగా, ఆ వీడియో అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.
ఆ వీడియోలో మీనాక్షి తన ముందు రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ను పెట్టుకుని లైఫ్ లో స్ట్రెస్ ఇదంతా ఏమీ వద్దు, ఓన్లీ ఫుడ్డు అంటూ చెప్పగా, ఇది బెస్ట్ మోటివేటిషనల్ వీడియో ఆఫ్ సెంచురీ అంటూ నవ్వింది. ఒక హీరోయిన్ అయుండి మీనాక్షి ఫుడ్ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా అనగనగా ఒక రాజు(Anagana oka raju) మూవీతో మంచి హిట్ అందుకున్న మీనాక్షి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.








