కూలీ ఎఫెక్ట్ తో జైలర్2 జాగ్రత్త పడిందా?
సినిమా ప్రమోషన్స్‌లో ట్రైలర్ పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ట్రైలర్లో కనిపించే ఒక్కో ఎలివేషన్, ఒక్కో షాట్ ఆడియన్స్ అంచనాలను అమాంతం పెంచేస్తోంది. అయితే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఏర్పడిన అంచనాలు సినిమా స్థాయిని మించిపోతే.. రిలీజ్ తర్వాత అదే సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. కూలీ(coolie) విషయంలోనూ ఇలాంటి డిస్కషనే బలంగా వినిపించింది. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా, థియేటర్లలో ఆడియన్స్ ఆశించిన స్థాయిలో అవి నెరవేరలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో జైలర్2(jailer2) ట్రైలర్‌ను గమనిస్తే మేకర్స్ కొంత జాగ్రత్తగా వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. సినిమాలో లేని అంశాలను చూపిస్తూ భారీ ట్విస్టులు, ఊహించని సర్ప్రైజ్లు ఉన్నాయనే భావన కలిగించకుండా.. కథలోని ప్రధాన సంఘర్షణ, రజనీకాంత్(rajinikanth) క్యారెక్టర్, యాక్షన్‌తో పాటు నెల్సన్(nelson) మార్క్ హ్యూమర్‌ను మాత్రమే పరిచయం చేశారు. దీంతో ట్రైలర్ సినిమా కంటే ఎక్కువగా ఉండబోతోందనే భ్రమ కలిగించకుండా, అసలు కంటెంట్‌పై అంచనాలను నిలిపే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది.
అసలు జైలర్ కు వచ్చిన క్రేజ్, రజనీకాంత్ స్టార్ పవర్, నెల్సన్ కాంబినేషన్, భారీ స్టార్కాస్ట్ కారణంగా జైలర్2కు స్పెషల్ గా కృత్రిమ హైప్ అవసరం లేదు. అందుకే కూలీ తరహాలో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లకుండా.. సినిమా ఏంటో ఆడియన్స్ కు ముందే ఒక ఐడియా ఇవ్వడానికే ట్రైలర్‌ను పరిమితం చేశారా అనే డిస్కషన్ మొదలైంది.








