విశ్వంభర రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదా?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కెరీర్లో అత్యంత ఆలస్యమైన ప్రాజెక్ట్‌గా విశ్వంభర(vishwambhara) ఇప్పటికే ప్రత్యేకంగా నిలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నప్పటికీ.. రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ కనిపించడం లేదు. ఇటీవలే డిజిటల్ రైట్స్ డీల్ పూర్తవడంతో ఓటీటీ సంస్థ నుంచి సంక్రాంతి బరిలోనే సినిమాను తీసుకురావాలనే ఒత్తిడి ఉందనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో చిరంజీవి నటిస్తున్న కాకా(kaaka) జనవరి 13, 2027న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ స్పష్టం చేయడంతో విశ్వంభర రిలీజ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
చిరంజీవి రెండు సినిమాల నిర్మాతలతో సమావేశమై రిలీజ్ సిట్యుయేషన్స్ పై డిస్కస్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత కాకా సంక్రాంతి రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గబోమని అనౌన్స్ చేయడం గమనార్హం. దీంతో విశ్వంభరకు ప్రత్యామ్నాయ రిలీజ్ విండోపై డిస్కషన్స్ ఊపందుకున్నాయి. సమ్మర్ 2027లో రిలీజ్ చేస్తారనే టాక్‌తో పాటు నవంబర్లోనే థియేటర్లలోకి తీసుకురావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇప్పటికే పలు భారీ సినిమాలు క్యూ కడుతున్న నేపథ్యంలో విశ్వంభరకు సరైన సోలో రిలీజ్ డేట్ దొరకడం కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
భారీ పెట్టుబడులు పెట్టిన యూవీ క్రియేషన్స్(UV craetions)కు సినిమాకు లాంగ్ రన్ దక్కడం చాలా ముఖ్యం. కనీసం రెండు వారాల పాటు పెద్ద పోటీ లేకుండా థియేటర్లలో కంటిన్యూ అయితేనే ఇలాంటి భారీ సినిమాకు బాక్సాఫీస్ పరంగా ఫుల్ రేంజ్ బెనిఫిట్ దక్కే అవకాశం ఉంటుంది. పైగా హాలిడే సీజన్ కలిసొస్తే ఓపెనింగ్స్‌కు మరింత బలం చేకూరుతుంది. త్రిష(Trisha) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(Keeravani) మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ మౌనం పాటిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అఫీషియల్ రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేసి విశ్వంభరపై కంటిన్యూ అవుతున్న ఊహాగానాలకు తెరదించాల్సిన అవసరం కనిపిస్తోంది.








