సరైనోడు రీయూనియన్ కు టైమ్ పట్టేలా ఉందే?
బన్నీ(bunny)- బోయపాటి(boyapati) కాంబినేషన్ మామూలుది కాదు. వీరి కలయికలో వచ్చిన సరైనోడు (Sarainodu) మాస్ ఆడియన్స్‌కు స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చింది. ఆ సినిమా సాధించిన భారీ సక్సెస్ తో వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లోనే మరో సినిమా వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ వేగంగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేలా వరుసగా భారీ ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. దీంతో గతంలో అనుకున్న కొన్ని కాంబినేషన్లు వెంటనే పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రస్తుతం అట్లీ(Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా(raaka)పై బన్నీ దృష్టి పెట్టగా, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్(lokesh kangaraj)తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ ఇప్పటికే భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బాసిల్ జోసెఫ్(basil joseph)తోనూ బన్నీ ఓ ప్రాజెక్ట్‌పై డిస్కషన్స్ జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమాలు లైన్లో ఉండటంతో బన్నీ కాల్షీట్లు ప్రస్తుతం పూర్తిగా బిజీగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో బోయపాటి(boyapati)తో బన్నీ రీయూనియన్ ఇప్పట్లో జరగకపోవచ్చనే డిస్కషన్ కు ఆస్కారం ఏర్పడింది. అయితే దీనిని ఈ కాంబినేషన్‌కు శాశ్వతంగా తెరపడినట్టుగా చూడాల్సిన అవసరం లేదు. బోయపాటి కూడా మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), గీతా ఆర్ట్స్(geetha arts) వంటి సంస్థలతో పాటు పలువురు స్టార్ హీరోలతో డిస్కషన్స్ చేస్తున్నారు. ఇద్దరి ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక సరైన కథ, సరైన టైమ్ కుదిరితే ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.








