రణబాలి ప్రమోషన్స్ ను మార్చాల్సిందే!
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్న(rashmika mandanna) జంటగా నటించిన రణబాలి (ranabaali)పై దసరా సీజన్లో భారీ అంచనాలే ఉన్నాయి. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌పై సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవల రిలీజైన ఇంటర్వ్యూల్లో సినిమా కంటే కొత్తగా పెళ్లైన జంట పర్సనల్ లైఫ్, వారి మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన గురించే ఎక్కువగా చర్చ జరగడం సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీసింది. దీంతో ప్రమోషన్స్‌లో అసలు సినిమాకు తగినంత ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రణబాలి వెనుక డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్(Rahul sankrithyan) చేసిన కసరత్తు మాత్రం చాలా పెద్దదే. స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో కథను రూపొందించిన ఆయన.. వాస్తవ ఘటనలు, స్థానిక పరిస్థితులపై విస్తృతంగా పరిశోధన చేసినట్లు ఇప్పటికే వెల్లడించారు. అక్కడి గ్రామాలను సందర్శించడం, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించడం, కథపై ఏళ్లపాటు వర్క్ చేయడం వంటి అంశాలు ఈ సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి భారీ ప్రయత్నం చేసిన సినిమాకు హీరోహీరోయిన్లు కూడా తమ ఎక్స్‌పీరియెన్స్‌లు, షూటింగ్ టైమ్ లో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడితే ప్రమోషన్స్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్న రణబాలికి ఇప్పుడు ట్రైలర్ కీలకంగా మారింది. ఇప్పటివరకు పర్సనల్ విషయాల చుట్టూ సాగిన ప్రమోషన్స్‌ను ఇకపై సినిమా కథ, విజువల్ స్కేల్, క్యారెక్టర్లు, మూవీ మేకింగ్, తమ కష్టాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విజయ్, రష్మిక తమ క్యారెక్టర్ల కోసం చేసిన హార్డ్ వర్క్ ను కూడా షేర్ చేసుకుంటే సినిమాపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగే అవకాశం ఉంది.








