వెంకటేష్ మహా ‘అట్టహాసం’.. ఫస్ట్ లుక్‌తో పెరిగిన క్యూరియాసిటీ!
వెంకటేష్ మహా మరోసారి విభిన్నమైన కథతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేరాఫ్ కంచరపాలెం, రావు బహదూర్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్‌ను ఏర్పరుచుకున్న ఆయన.. ఇప్పుడు అట్టహాసం సినిమాతో మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. టైటిల్లోనే ఎంటర్టైనింగ్ టోన్ కనిపిస్తున్నప్పటికీ.. సినిమా మరోసారి సహజత్వానికి దగ్గరగా ఉండే కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ లుక్‌లో వెంకటేష్ మహా, స్రవంతి పీపకాయల కలిసి కనిపించడం ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. మరోవైపు కార్తీక్ రత్నం, పావని కరణం జోడీ కూడా పోస్టర్లో స్పెషల్ గా కనిపిస్తోంది. ఈ నాలుగు పాత్రల మధ్య సంబంధం ఏమిటి? కథ ఏ పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్నాయి. లైఫ్ లో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, వాటి నుంచి పుట్టే హాస్యాన్ని కథలో కీలకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
వెంకటేష్ మహానే అట్టహాసం సినిమాకు కథ, దర్శకత్వం అందించడంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. చింత వరలక్ష్మి సమర్పణలో చింత గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింత నిర్మిస్తుండగా.. చింత వినీషా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2027 సమ్మర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.








