బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే ఆదర్శ కుటుంబం వాయిదా పడిందా?
వెంకటేష్(venkatesh)- త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam)పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా తాజాగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ వాయిదా వెనుక అసలు కారణం ఏమిటనే డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. సినిమా సెకండాఫ్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ పూర్తిగా సంతృప్తి చెందలేదనే టాక్ ఉంది. తమన్(thaman) అందించిన స్కోర్‌లో కొన్ని మార్పులు అవసరమని భావించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) రంగంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆదర్శ కుటుంబంకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రత్యేకంగా వర్క్ చేస్తున్నారని, ఈ పనిని త్రివిక్రమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి
జీవీ ప్రకాష్ వర్క్స్ పూర్తైన తర్వాత సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై మరోసారి సమీక్ష జరగనుంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న వెంకటేష్ తిరిగి వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి(Sreenidhi shetty) జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(haarika Hassine Creations) నిర్మిస్తోంది. వాయిదాతో రిలీజ్‌పై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.








