చరణ్ కు మైథాలజీ టచ్.. సుకుమార్ లెక్కేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. రంగస్థలం(rangasthalam) మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కథ, జానర్‌పై పలు రకాల ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండొచ్చనే టాక్ కొత్త డిస్కషన్ కు తెరతీసింది. ఇదే నిజమైతే సుకుమార్ ఎంచుకున్న జానర్ వెనుక పెద్ద కమర్షియల్ లెక్కే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్‌లో చరణ్‌కు ఉన్న ఇమేజ్‌కు మైథాలజీ అంశాలను జోడిస్తే హీరో క్యారెక్టర్ ను మరింత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చరణ్ విభిన్నమైన మాస్, క్లాస్, పీరియాడిక్, యాక్షన్ పాత్రల్లో కనిపించినప్పటికీ.. పూర్తి స్థాయి మైథాలజీ టచ్ ఉన్న క్యారెక్టర్ లో చూడలేదు. అందుకే ఈ ప్రచారం నిజమైతే ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా కొత్తగా ఉండొచ్చనే ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో చరణ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ తరహా కాన్సెప్ట్ మరింత విస్తృత ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి
ఇక ఈ సినిమాను దసరా సందర్భంగా ముహూర్త కార్యక్రమాలతో ప్రారంభించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో సినిమాకు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ లేదా చరణ్ లుక్‌పై ఏదైనా కీలక ప్రకటన వస్తుందా అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు ఇతర ప్రచారంలో ఉన్న అంశాలపై మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటివరకు సుకుమార్ ఈసారి చరణ్‌ను ఏ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారనే ఆసక్తి మాత్రం కొనసాగనుంది.








