క్రికెట్, బీట్స్, యూత్ క్రేజీ ఎనర్జీ.. ‘హై’ నుంచి ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ రిలీజ్
బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు, పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా అలరించబోతున్నారు. ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆయన.. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ‘హై’ భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘హై’ సినిమా ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదలైంది. సాధారణ ప్రమోషనల్ విజువల్స్‌కు భిన్నంగా, మేకర్స్ ఈ పాటను సరదాగా, ఉత్సాహంగా రూపొందించారు. సినిమాలోని ప్రధాన తారాగణమంతా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కించిన వీడియోలో కనిపిస్తూ సందడి చేశారు. యూత్‌ఫుల్ సెలబ్రేషన్స్‌తో నిండిన ఈ వీడియో పాటలోని మూడ్‌ను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందిస్తోంది.
రోల్ రైడా ఎనర్జిటిక్ ర్యాప్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, వికాస్ బదిసా తన బీట్తో కూడిన సంగీతం, ఉత్సాహభరితమైన రిథమ్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. సాహిత్యం కూడా పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తంగా ‘దమ్ములుంటే’ సంగీత ప్రియులను అలరించేలా రూపొందింది.
స్నేహం, సరదా, అనుకోకుండా ఎదురయ్యే ఆసక్తికరమైన క్షణాలు.. యూత్ జీవితంలో ఉండే ఉత్సాహాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది. రంగురంగుల విజువల్స్, ఉత్సాహభరితమైన కొరియోగ్రఫీ పాటకు మరింత ఆకర్షణను జోడించాయి.
మనుషులు ఆనందం, సంతోషం, ఉత్సాహం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటి విభిన్నమైన కోరికలతో ముందుకు సాగే పాత్రల కథే ‘హై’. ప్రతి పాత్ర వెనుక ఒక ప్రత్యేకమైన ఆకాంక్ష ఉంటుంది. ఈ పాత్రల ప్రయాణాలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ, మనుషుల నిర్ణయాల్లోని భావోద్వేగ, మానసిక, నైతిక కోణాలను ఈ సినిమా ఆవిష్కరించనుంది.
ఈ చిత్రానికి మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వికాస బదిసా సంగీతం సమకూరుస్తున్నారు. జీఆర్కే శరణ్ రావుల ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.







