AA22: బన్నీ బర్త్ డే రోజున వచ్చేదదే.. బన్నీ వాసు క్లారిటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అట్లీ(Atlee) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా గురించి స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి భారీ టీజర్ లేదా గ్లింప్స్ విడుదలవుతుందని ఊహాగానాలు వినిపించినప్పటికీ, చిత్రబృందం మాత్రం అలాంటి ప్లాన్లో లేనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బర్త్డే రోజున కేవలం టైటిల్ పోస్టర్ను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు ముగింపు పలికినట్టైంది.
ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాస్(bunny vasu) ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కన్ఫర్మ్ చేశారు. తనకు తెలిసిన మేరకు ఈ సినిమా నుంచి ప్రస్తుతానికి ఎలాంటి వీడియో కంటెంట్ రిలీజ్ అవడం లేదని ఆయన తెలిపారు. కథా నేపథ్యం మరియు కాన్సెప్ట్ చాలా స్పెషల్ గా ఉండటంతో, ముందుగానే విజువల్స్ బయటపెట్టకుండా సస్పెన్స్ కొనసాగించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని వివరించారు. దీంతో అభిమానులు సినిమాకు సంబంధించిన విజువల్ అప్డేట్స్ కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉండగా, సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొణె(Deepika padukone) హీరోయిన్గా నటిస్తోంది. సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, ఇప్పటికే మూవీపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా బర్త్డే సందర్భంగా రిలీజయ్యే టైటిల్ ఏమై ఉంటుందనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. ఆ టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ తీసుకురానుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








