బుచ్చితో మరోసారి చరణ్?
టాలీవుడ్లో తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం స్ట్రాంగ్ లైనప్‌తోనే కొనసాగుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పెద్ది(Peddi) సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తో మరో ప్రాజెక్ట్ అధికారికంగా లాక్ అయింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ నెక్స్ట్ స్టెప్స్ ఏమిటన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఇలాంటి సమయంలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన(buchibabu sana) తో చరణ్ మరోసారి కలిసే అవకాశాలపై వినిపించిన ఊహాగానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మ్యాగజైన్ షూట్ వీడియో కింద బుచ్చిబాబు చేసిన కామెంట్ ఈ చర్చకు కారణమైంది. సర్, ఇంకో ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన చేసిన కామెంట్ స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. ఈ ఒక్క లైన్‌తోనే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో వేగంగా పాకుతున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్ది రిలీజ్‌కు ముందే ప్రీరిలీజ్ ఈవెంట్లోనే అనౌన్స్ చేస్తారా, లేక సినిమా తర్వాత స్పెషల్ గా అనౌన్స్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబో మళ్లీ సెట్ అయితే, చరణ్ కెరీర్లో ఇది మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముంది. మొత్తానికి, ఒక్క సోషల్ మీడియా రిప్లైతోనే చరణ్ ఫ్యూచర్ లైనప్‌పై కొత్త చర్చ మొదలవడం గమనార్హం.








