చీరకట్టులో మరింత అందంగా అనసూయ
స్టార్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) తర్వాత సినిమాల్లో నటిస్తూ, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాల్లోకి వచ్చాక యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో అనసూయ పట్టుచీర కట్టుకుని ఎంతో సంప్రదాయంగా కనిపించింది. చీరకు తగ్గట్టుగా టెంపుల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్ మరింత ఎలివేట్ అయ్యేలా చేయగా, ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ నెటిజన్లు వాటిని వైరల్ చేస్తున్నారు.








