Adivi Sesh: శేష్ ఆ డైరెక్టర్ కు ఓకే చెప్తాడా?
టాలీవుడ్లో స్టోరీ సెలెక్షన్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే హీరోలలో అడివి శేష్(Adivi sesh) ఒకరు. ప్రతి ప్రాజెక్ట్‌కు ముందు స్క్రిప్ట్‌పై సమయం వెచ్చిస్తూ తన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చుకున్న ఆయన ప్రస్తుతం కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా డెకాయిట్(Dacoit), గూఢచారి2(Goodachari2) లాంటి ప్రాజెక్ట్‌లు ఆయన కెరీర్లో కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో మరో కొత్త కథపై కూడా శేష్ దృష్టి పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ కథను వినిపించిన వ్యక్తి యాక్టర్‌గా మొదలై డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran). చిలసౌ(Chilasow)తో మొదలైన ఆయన దర్శకత్వ ప్రయాణం తర్వాత మన్మథుడు2(Manmadhudu2)తో కొనసాగింది. రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) కూడా డిస్కషన్ టాపిక్ గా నిలిచింది. గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత రాహుల్ రెండు కొత్త కథలను సిద్ధం చేసుకుని ప్రస్తుతం హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందులో ఒక కథను అడివి శేష్‌కు వినిపించగా, అది ఆయనకు ఆసక్తికరంగా అనిపించినట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే శేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల కారణంగా వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా రాహుల్ త్వరలోనే దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) హీరోగా ఒక కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి శేష్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ ముగించుకునే అవకాశముంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ కాంబినేషన్లో ఒక కొత్త ప్రాజెక్టు తెరపైకి రావచ్చని సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








