Dacoit: డెకాయిట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసిన బిగ్ ఫిల్మ్ – అడివి శేష్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత, మేకర్స్ ఈరోజు అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ లవ్ స్టొరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది.
మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ షేడ్స్‌తో ఆకట్టుకుంది. శేష్ రగ్గడ్ అవతార్‌లో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.
మృణాల్ ఠాకూర్ పాత్ర శేష్ పాత్రలతో పాటు ప్రయాణిస్తుంది, అమాయకత్వం, ఎమోషన్ మధ్య ఊగిసలాడుతూ కథనానికి డెప్త్ ని జోడిస్తుంది. టీజర్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్‌లను కీలక పాత్రలలో పరిచయం చేస్తుంది. అనుభవజ్ఞులైన నటుల అద్భుతమైన తారాగణం శక్తివంతమైన ఆన్-స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధంగా వుంది.
సాంకేతికంగా టీజర్ అత్యున్నతంగా వుంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు. జ్ఞానీ ఇంటెన్స్ స్కోర్ టీజర్లో ఉత్సాహాన్ని నింపుతుంది. బీజీఎం లో ఐకానిక్ సాంగ్ ‘కన్నె పిట్టరో కన్ను కొట్టరో’ రీమిక్స్ చేయడం ఎక్స్ పీరియన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళుతుంది.
నిర్మాణ విలువలు అద్భుతంగా ఉనాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ అద్భుతమైన టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ట్విట్టర్లో చాలా కాలంగా చదువుతున్నాను. కుర్రాడు ఎక్కడికి పోయాడు? ఏం చేస్తున్నాడు? అని అంటున్నారు( నవ్వుతూ). ఇక్కడే ఉన్నాను. ఈ సినిమానే చేస్తున్నాను. ఈ సినిమా విషయంలో మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము. ఇది చాలా బిగ్ ఫిలిం. రెండు భాషల్లో తీశాం .ఇది ప్రాపర్ తెలుగు, హిందీ సినిమా. ఒక తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా. నేను షానియల్ కలిసి రాశాము. తను నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం యూఎస్ లో పెరిగాం. తను మన కల్చర్ అర్థం చేసుకొని నేను తన కల్చర్ అర్థం చేసుకుని ఒక హైబ్రిడ్ సినిమా చేశాం. తను టెక్నికల్ ఒక అమెరికన్ స్టైల్ లో తీశాడు. అనురాగ్ సార్ లాంటి వరల్డ్ క్లాసు ఫిలిం మేకర్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన మాకు ఎంతో మంచి గైడెన్స్ ఇచ్చారు. నిజంగా అది మా అదృష్టం. మృణాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు. ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వచ్చిందంటే కారణం సుప్రియ గారే. నాగ్ సార్ కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్ ఆలోచన కూడా సుప్రియ గారిదే. ఆ క్లాసిక్ సాంగ్ తీసుకొని మన సినిమాలో వైబ్రేట్ గా వాడడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సునీల్, జాన్వి గారు కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా కాలం తర్వాత మీ అందరిని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఉన్న యాక్షన్ ఇంపాజిబుల్. చాలా ఫన్ తో కూడిన ఎక్స్పీరియన్స్. రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్ చేయడం అనేది నాకు ఇదే ఫస్ట్ టైం. ఒక ఫిలిం మేకర్ నటుడుగా సెట్ లోకి వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. ఇది వెరీ ఫన్ లాంగ్ చేజ్ ఫిలిం.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నా మనసుకు చాలా దగ్గరయింది. నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను. టీం కూడా అంతే ప్యాషన్ తో పనిచేశారు. షానియల్ డియోతో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ . ఫిమేల్ ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. సీతారామంలో స్వప్న గారు ఇప్పుడు సుప్రియ గారితో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సుప్రియ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. శేష్ గారు నా మోస్ట్ ఫేవరెట్. తను ట్రూ జెంటిల్మెన్. ఈ సినిమాలో మీరు తన క్యారెక్టర్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. తన స్క్రీన్ ప్రజెంట్ మ్యాజికల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ థాంక్యు.
డైరెక్టర్ షానియల్ డియో మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. 14 సంవత్సరాల క్రితం కాలిఫోర్నియాలో శేష్ అన్నని కలిసి ఒక కథ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు తను నా కోవర్కర్. తర్వాత ఫ్రెండ్ అయ్యారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్. నేను ఈ దేశంలో ఉండడానికి కారణం ఆయనే. ఆయన గైడెన్స్ నాకు ఎంతో ఉపయోగపడింది. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మృణాల్ గారితో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. తన నుంచి చాలా పాజిటివ్ తీసుకున్నాను. సుప్రియ గారు లేకపోతే ఈ ప్రాజెక్టు పాసిబుల్ అయ్యేది కాదు. తను భయం లేని ప్రొడ్యూసర్. సినిమాకు కావలసిన చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.
ఎడిటర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శేష్ గారిని మీరు ఎప్పుడు కూడా క్లాస్ క్యారెక్టర్ లో చూశారు. ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్ లో చూడబోతున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుప్రియ గారికి థాంక్యూ టీజర్ కి ఈ సాంగ్ ని వాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలో రొమాన్స్ అక్కినేని ఫ్యాన్స్ కి తెలుసు. శేష్ గారు నాకు పాన్ ఇండియా ఎడిటర్ అనే ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






