#SVC59: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ SVC59. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ నెల 22న సాయంత్రం 7.29 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో తన మదిలో రూపుదిద్దుకున్న హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్ కోలా. ‘ఒక మనిషి గురించి ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా, నా జ్ఞాపకాల్లో అతను ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా, అతన్ని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించాను. అతనిది అందరికీ చెప్పాల్సిన కథ. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను..’ అంటూ రిలీజ్ చేసిన డైరెక్టర్స్ నోట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రక్తం కారుతున్న హీరో విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ ఈ ప్రోమోను ముగించడం ఆసక్తి కలిగిస్తోంది.






