Booky: విజయ్ ఆంటోనీ, అజయ్ దిషన్ ‘బుకీ’
అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బుకీ’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ‘బుకీ’ బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ఈ సాంగ్ ని అద్భుతమైన వైబ్ తో కంపోజ్ చేశారు. విజయ్ ఆంటోని, ఖరెస్మా రవిచంద్రన్ ఎనర్జిటిక్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. భాష్యశ్రీ సాహిత్యం క్యాచిగా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది.
ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.






