ATA: డిసెంబర్ 19న ఆటా ఆధ్వర్యంలో బిజినెస్ సెమినార్
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక బిజినెస్ సెమినార్ నిర్వహించనున్నట్లు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి తెలిపారు. ఈ సదస్సు 2025 రేపు ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్లోని టీ-హబ్ లో జరగనుందని, భారత్, అమెరికా వ్యాపార సంబంధాలపై దృష్టి సారిస్తూ నిర్వహించే ఈ సదస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దూదిళ్ళ శ్రీధర్ బాబు, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే ఈ సెమినార్ లో భారత్, అమెరికా మధ్య ప్రస్తుత వ్యాపార సంబంధాలు, పెట్టుబడి అవకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా అమెరికా ఇన్వెస్ట్మెంట్ వీసాలు, భారత పెట్టుబడిదారులకు మార్గాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సెంటర్లు, భారత డిజిటల్ భవిష్యత్తుకు దోహదం, డిఫెన్స్ & ఏరోస్పేస్ రంగంలో భారత్ వ్యూహాత్మక ఎదుగుదల వంటి కీలక అంశాలపై మాట్లాడనున్నారని అన్నారు. వ్యాపారవేత్తలు, పరిశ్రమ నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ సదస్సు ఒక వినూత్న వేదిక అని, అందరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.






