Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ
RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన RBI గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించిన సంజయ్ మల్హోత్రా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించిన సీఎం. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై RBI గవర్నర్ కు వివరించిన సీఎం. సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించిన సీఎం. BUDS యాక్ట్ ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని కోరిన RBI గవర్నర్. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన RBI గవర్నర్. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేజ్ (ULI) విషయం RBI తీసుకుంటున్న చొరవను సిఎం కు వివరించిన RBI గవర్నర్. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్స్ క్లెయిమ్ క్యాంపెయినింగ్ పై సిఎం కు వివరించిన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, RBI హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్స్ మేజర్ యశ్పాల్ చరణ్, S పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు.






