Kadiyam Srihari: ‘నేను కాంగ్రెస్ లో చేరలేదు …బీఆర్ఎస్లోనే ఉన్నా’
ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పందించారు. తాను బీఆర్ఎస్ (BRS) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కడియం స్పష్టం చేశారు. తాను పార్టీ మారానన్నది పచ్చి అబద్ధమన్నారు. ఈ విషయంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం వివరణ ఇచ్చిన ప్రతిని స్పీకర్ ప్రసాద్‌కుమార్ (Prasad Kumar) బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda)కు పంపారు.






