Chandrababu:నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు .. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
విద్యార్థులకు నాలెడ్జ్‌తో పాటు విలువలూ చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు (Collectors’ Conference)లో చంద్రబాబు మాట్లాడారు. ఇంటర్ వరకూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముస్తాబు పై ప్రజెంటేషన్ ఇచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి (Prabhakara Reddy)కి అభినందనలు తెలిపారు. నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయొచ్చని, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలన్నారు.






