Tirumala: తమిళనాడు భక్తుల అత్యుత్సాహం .. చర్యలు తీసుకుంటాం : టీటీడీ
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడు (Tamil Nadu)కు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నాడీఎంకే (AIADMK) పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించారు. సోషల్ మీడియా (Social media)లో ఇది వైరల్‌గా మారింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు భక్తులు ప్రవర్తించడంపై టీటీడీ స్పందించింది. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నేతల ఫొటోలతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్‌ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని టీటీడీ సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.






