Mahesh Kumar: ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం: మహేశ్ గౌడ్
పంచాయతీ ఎన్నికల తుది విడతలోనూ పల్లె ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని, ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంప పెట్టని, గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు (Ministers) స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్ (Congress) పై విశ్వాసాన్ని మరింత పెంచాయని తెలిపారు. ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని, గ్రామీణ అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.






