Venkaiah Naidu : అమెరికాలోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది భారతీయులే : వెంకయ్య నాయుడు
ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే మన దేశం మరింత ముందుకు వెళ్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నాడు. ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల (ANR College) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ (India) అని ఐఎంఎఫ్ నివేదిక ఇచ్చింది. అమెరికా (America) లోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది భారతీయులే. ఇంట గెలిచాం కాబట్టే రచ్చ గెలుస్తున్నాం. సవాళ్లను గుర్తించి ముందుకెళ్లాలి. సంపద, సంక్షేమం అందరికీ అందాలి. 18 శాతం మంది ఇంకా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వారిని ఆదుకోవాలి. ఆర్థికంగా, సామాజికంగా, దౌత్యపరంగా దేశం నూతన శకాన్ని ఆవిష్కరిస్తోంది. 9 ఏళ్ల క్రితం 15 శాతానికే పరిమితైన డిజిటల్ వినియోగం నేడు డిజిటల్ ఇండియా కార్యక్రమంతో 48 శాతానికి చేరింది. విద్యార్థులు దీనిపై మరింత దృష్టి పెట్టాలి అని అన్నారు.






