Adi Srinivas: వాళ్లు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది : ఆది శ్రీనివాస్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad Kumar) ఇచ్చిన తీర్పునకు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas)తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఇరుపక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా స్పీకర్ తీర్పు ఇచ్చారని, స్పీకర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్లు యథేచ్ఛగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న వాళ్లు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితాని బీఆర్ఎస్ క్యాబినెట్లోకి తీసుకున్న విషయాన్ని మర్చిపోయారా. నాడు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్‌లు ఫిరాయింపుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.






