LPG: భారత్‌కు భారీగా ఎల్పీజీ, కష్టాలు తీరేనా..?
దేశంలో వంట గ్యాస్ (LPG) కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాపై నీలినీడలు కమ్ముకున్న వేళ, భారత్‌కు వరుసగా ఎల్పీజీ నౌకలు చేరుకోవడం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. తాజాగా కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టు (NMP) కు భారీ ఎల్పీజీ నౌక చేరుకోవడంతో గ్యాస్ నిల్వలు పెరగనున్నాయి. తాజాగా మంగుళూరు పోర్ట్ కు వచ్చిన పిక్సిస్ పయనీర్ అనే భారీ నౌక సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది.
ఈ భారీ నిల్వలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల గ్యాస్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే సిలిండర్ల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ దిగుమతి దోహదపడుతుంది. కేవలం ఈ ఒక్క నౌకతోనే ఆగకుండా, వచ్చే కొద్ది రోజుల్లో భారత్‌కు భారీ ఎత్తున ఎల్పీజీ నిల్వలు రానున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వచ్చే వారంలోనే సుమారు 72,700 టన్నుల ఎల్పీజీ దేశానికి అందనుంది. ఈ నెల 25వ తేదీన ‘ఓషన్’ (Ocean) అనే మరో భారీ నౌక భారత తీరానికి చేరుకోనుంది.
ఇది సుమారు 26,687 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. నెల ఆఖరులో అంటే మార్చి 29న సుమారు 30,000 టన్నుల ఎల్పీజీతో ఇంకొక నౌక సిద్ధంగా ఉంది. ఈ వరుస దిగుమతుల వల్ల దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా గొలుసు (Supply Chain) బలోపేతం కానుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల (Geopolitical Situations) వల్ల ఇంధన ధరలు పెరగడం లేదా సరఫరా ఆగడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ ముందుస్తుగా భారీ నౌకల ద్వారా గ్యాస్‌ను దిగుమతి చేసుకోవడం ఒక తెలివైన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నిల్వలు పెరగడం వల్ల గ్యాస్ ఏజెన్సీలకు(Gas Agency) సిలిండర్ల పంపిణీ వేగవంతం అవుతుంది. వినియోగదారులకు వెయిటింగ్ పీరియడ్ తగ్గనుంది.
ఇవి కూడా చదవండి








