ఉప్పల్ వేదికగా నేడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ పోరు..!
ఐపిఎల్(IPL) సీజన్ లో 2026 సీజన్లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని(Hyderabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ ఆసక్తికర పోరు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై ఆడుతుండటం ఎస్ఆర్హెచ్కు అదనపు బలంగా మారుతుండగా, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే పోరు చాలా హోరాహోరీగా సాగింది.
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 26 సార్లు తలపడగా, అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. గత సీజన్ లో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించగా, హైదరాబాద్‌లో జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. తమ గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై(CSK) 10 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది.
ముఖ్యంగా అభిషేక్ శర్మ(Abhishek Sharma), హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నారు. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును(RCB) ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో స్థిరత్వం లోపించడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి కీలకం కానుంది. హైదరాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది, అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముందంజలో ఉండటానికి ఈ రెండు జట్లకు నేటి విజయం ఎంతో కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి







