ICC Rankings: టాప్-2లో అభిషేక్, ఇషాన్.. అగ్రస్థానం కోల్పోయిన వరుణ్!
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత విజయంతో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఆటగాళ్లు.. తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ (ICC Rankings) తమ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్లు తమ ర్యాంకింగ్స్‌ను అమాంతం మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో తొలి రెండు స్థానాలను టీమిండియా ఆటగాళ్లే కైవసం చేసుకోవడం విశేషం.
బ్యాటింగ్‌లో మనోళ్లదే అగ్రస్థానం..
తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు).. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నంబర్ వన్ (No. 1) ర్యాంకును సగర్వంగా నిలబెట్టుకున్నాడు. టోర్నీలో నిలకడగా రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (871 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి ఏకంగా రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. వీరి దెబ్బకు పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా (848), ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (792) ఒక్కో స్థానం కిందకు పడిపోయారు.
మరోవైపు భారత కుర్రాడు తిలక్ వర్మ (742) ఒక స్థానం కోల్పోయి 7వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకులో నిలవగా.. శివమ్ దూబే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 27వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి
వరుణ్‌కు నిరాశ..
బౌలింగ్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టోర్నీ ఆసాంతం అదరగొట్టి 14 వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740 పాయింట్లు).. తన (ICC Rankings) అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఒకే వికెట్ తీయడంతో ఏకంగా 68 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ (753 పాయింట్లు) తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
![]()
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఫైనల్లో అద్భుత స్పెల్ వేసిన పేస్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా (702 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ ర్యాంకుకు (ICC Rankings) చేరుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ 16, అక్షర్ పటేల్ 17వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ఆల్రౌండర్లలో మార్పుల్లేవ్..
టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (328 పాయింట్లు) అగ్రస్థానంలో (ICC Rankings) కొనసాగుతుండగా.. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (299 పాయింట్లు) తన రెండో ర్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో సత్తా చాటిన శివమ్ దూబే.. ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం రెండు స్థానాలు దిగజారి టాప్-10 నుంచి బయటకు (11వ ర్యాంకు) వెళ్లాడు.
ఇవి కూడా చదవండి








