Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఇషాన్ కిషన్!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం తాజాగా విడుదల చేసిన టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) అద్భుతమైన ప్రగతి కనబరుస్తూ ఏకంగా టాప్-5లోకి దూసుకెళ్లాడు.
బ్యాటింగ్‌లో అభిషేక్ ఆధిపత్యం..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా విఫలమవుతున్నప్పటికీ, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తన నంబర్ వన్ (No. 1) ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకున్నాడు. విశేషమేమిటంటే, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కంటే అభిషేక్ (Abhishek Sharma) ఇంకా 62 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
ఇషాన్ జోరు..
గత వారమే టాప్-10లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. తాజా జాబితాలో మరో మూడు స్థానాలు ఎగబాకి ఏకంగా 5వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఇదే జాబితాలో భారత యువ సంచలనం తిలక్ వర్మకు కాస్త నిరాశ ఎదురైంది. అతను మూడు స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో బిగ్ హిట్టర్ శివమ్ దూబే బ్యాటింగ్‌లో ఒకేసారి 13 స్థానాలు మెరుగుపరుచుకుని 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
![]()
బౌలింగ్, ఆల్‌రౌండర్ల విభాగాల్లో సత్తా..
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన అగ్రస్థానాన్ని (నం. 1 ర్యాంక్) విజయవంతంగా నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 7 స్థానాలు అధిగమించి టాప్-10లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో అద్భుతంగా రాణిస్తున్న శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంక్ చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి








