హెచ్ఐవీ చికిత్సలో మరో ముందడుగు
హెచ్ఐవీ చికిత్స దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఈ వైరస్ నిరోధక గుణాలున్న కొత్త కణాలను అభివృద్ధి చేశారు. వైరస్ సోకిన కణాల స్థానాన్ని ఇవి భర్తీ చేసి, హెచ్ఐవీతో పోరాడతామని స్క్రిప్స్ పరిశోధక సంస్థ (టీఎస్ఆర్ఐ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో చికిత్స ద్వారా హెచ్ఐవీ బాధితులకు నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. రోగి శరరీంలో ఈ కణాల సంఖ్యను పెంచడం ద్వారా వారికి దీర్ఘకాలిక రక్షణ కల్పించవచ్చని వివరించారు. హెచ్ఐవీ చికిత్సలో భాగంగా, రక్త ప్రవాహంలో యాంటీబాడీలను స్వేచ్ఛగా వదిలేస్తామని చెప్పారు. ఇవి రక్తంతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు ప్రవహిస్తూ, వైరస్ సోకిన ప్రాంతాలలోని కణాలను పక్కకు తప్పించి వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయని తెలిపారు. ఫలితంగా మిగతా అవయవాలకు వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవడంతో పాటు కణాల పున:స్థాపన ద్వారా దానిని కట్టిపడేయవచ్చని వివరించారు.













