ఆదివాసీల హక్కుల కోసం కలిసి నిలబడదాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ..రేవంత్ రెడ్డి
ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
“ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం – ఆదివాసీ సంస్కృతి. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ… యావత్ మానవాళికి మార్గదర్శకం. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ… వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలి.” అని పేర్కొన్నారు.








