తెలంగాణలో ప్రారంభమైన జనగణన
తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత జనగణన ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సెల్ఫ్ ఎన్యూమరేషన్ ( స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో మంత్రి పొన్నం జనగణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని కోరారు. ప్రతి పౌరుడు తన కుటుంబ వివరాలను జనాభా లెక్కల్లో చూపెట్టాలన్నారు. దేశంలోనే తెలంగాణ (Telangana) ప్రథమ స్థానంలో ఉండేలా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self-enumeration) జరగాలన్నారు. తాను స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్నానని, ఈ ప్రక్రియ అత్యంత సరళంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








